తనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని బాధితురాలు గదిలో బంధించింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి పట్టించింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. బాధితురాలి వయసు 30 యేళ్లు. ఈమెకు ఆ కామాంధుడికి నెలన్నర క్రితం పరిచయమైంది. అంతలోనే ఆ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
30 యేళ్ళ ఎయిర్‌హోస్టెస్ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో పని చేస్తున్నారు. ఈమెకు హర్జీత్ యాదవ్ అనే వ్యక్తి నెలన్నర క్రితం పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాధితురాలి ఇంటికే వెళ్లిన హర్జీత్ యాదవ్ లైంగిక దాడికి తెగబడ్డాడు. కాన్పూర్‌కు చెందిన ఈ వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి బ్లాక్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు.
అయితే అత్యాచారానికి గురైన తర్వాత కూడా ఆమె ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా... ఆతన్ని గదిలో బంధించి పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు హర్జీత్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై సెక్షన్ 376 (అత్యాచారం), 323 (ఒక వ్యక్తిని హింసించడం), 509 (మహిళ గౌరవాన్ని నాశనం చేయడం), 377 (ప్రకృతి విరుద్ధమైన చర్యలకు పాల్పడటం) కింద కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ చందన్ చౌదరి మాట్లాడుతూ 30 ఏళ్ల బాధితురాలు ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తుందని, హర్జీత్ యాదవ్ ఆమెకు నెలన్నర క్రితం పరిచయమయ్యాడని తెలిపారు. మద్యం మత్తులో బాధితురాలి ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడని చెప్పారు. అతన్ని గదిలో బంధించి 112 నంబరుకు ఫోన్ చేసి సమాచారం చేరవేసిందని చెప్పారు.