Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు - హస్తినలో హైఅలెర్ట్

Advertiesment
delhi firing
, మంగళవారం, 9 ఆగస్టు 2022 (15:04 IST)
దేశ రాజధాని ఢిల్లీలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన దేశ 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల వేళ ఉగ్రమూకలు దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని కేంద్రం నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించాయి. ప్రధాన కూడళ్ళతో పాటు ఆలయాలు, చర్చిలు, మసీదులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో భారీ భద్రతను కల్పించారు. 
 
ఢిల్లీలో గాలిపటాలు, బెలూన్లు ఎగురవేయకుండా అడ్డుకునేందుకు 400 మంది సైనికులను ప్రత్యేకంగా నియమించారు. ఎర్రకోట, ఢిల్లీ పోలీస్‌ కమాండోల చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలను స్వాధీనం చేసుకొని వాటిపై షూటర్లను మోహరించనున్నారు. దాదాపు 10 మంది మంది బలగాలను మొహరించారు. 
 
అదేవిధంగా కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న రోహింగ్యాల కాలనీలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 15న భూమి నుంచి ఆకాశం వరకు అన్నింటిపై నిఘా వేస్తామని ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ కమిషనర్‌ దీపేందర్‌ పాఠక్‌ పేర్కొన్నారు. 
 
ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ వచ్చిన సమాచారం మేరకు.. అన్ని భద్రతా సంస్థల సమన్వయంతో ఎర్రకోట వద్ద సెక్యూరిటీ సర్కిల్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఎర్రకోట చుట్టుపక్కల నో ఫ్లయింగ్‌ జోన్‌ అమలులో ఉంటుందని.. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురడంపై నిషేధం ఉంటుందన్నారు. అలాగే వెయ్యికిపైగా అత్యాధునిక సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - నీకు 9 నాకు 9... పదవుల పందేరం