Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు గీత మార్చే సినిమా కావాలిః వి.వి.వినాయక్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (18:02 IST)
VVVinayak, Vishwa, Rachaiah
గ్రాండ్ మూవీస్" పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం "గీత". వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. "మ్యూట్ విట్నెస్" అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈనెల 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. 
 
ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ "తన శిష్యుడు విశ్వకు మంచి పేరు, తన మిత్రుడు రాచయ్యకు డబ్బు తెచ్చే మంచి చిత్రంగా "గీత" నిలవాలని" ఆకాంక్షించారు. వి.వి.వినాయక్ తమ చిత్రం "గీత" ఘన విజయం సాధించాలని అభినందించడం పట్ల నిర్మాత రాచయ్య, దర్శకుడు విశ్వ సంతోషం వక్తం చేశారు. ఈనెల 14న "గీత" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
 
క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్‌గా నటించారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, డాన్స్: అనీష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, కో-డైరెక్టర్: వి.వి.రమణ, నిర్మాత: ఆర్.రాచయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments