Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌దేళ్ళ బాలిక సినిమా తార అయిన క‌థ‌తో చిత్రం

Advertiesment
clap by Kashi Vishwanath
, శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:17 IST)
clap by Kashi Vishwanath
ఓ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది. చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనే చిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం "తార". వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై పి. పద్మావతి సమర్పణలో కేరాఫ్ కంచర పాలెం ఫేమ్ కిషోర్ హీరోగా, సత్యకృష్ణ హీరోయిన్ గా, బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ నటీ నటులుగా యం.బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ   వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్నచిత్రం.
 
సినిమా పూజా  కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, నటుడు, నిర్మాత సాయి వెంకట్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు.గూడ రామకృష్ణ  ఫస్ట్ డైరెక్షన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశంలో 
 
చిత్ర దర్శకుడు యం. బి (మల్లి బాబు) మాట్లాడుతూ,  పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనేదే ఈ చిత్ర కథాంశం. అన్ని వర్గాల  వారిని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 నుంచి  ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ తో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. మంచి కథను సెలెక్ట్ చేసుకొని మేము తీస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ  ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు
 
నిర్మాత పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా మా బానర్లో ఇది నాలుగవ సినిమా. ఈ సినిమాతో మా అబ్బాయి యం. బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. మా గత చిత్రాలను ఆదరించినట్లే ఇప్పుడు తీస్తున్న "తార"  సినిమాను కూడా  ఆశీర్వదిస్తూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
 
కో ప్రొడ్యూసర్ సాయిమల్లి అరుణ్ రామ్ మాట్లాడుతూ.. దర్శకుడు యం. బి (మల్లి బాబు) కొత్త కథ, కథనం తో రూపొందించిన ఈ సినిమా  ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవిపెద్ద మనసుతో శుభాకాంక్షలు తెలిపారుః స్వాతి ముత్యం నిర్మాత ఎస్. నాగవంశీ