Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

సెల్వి
శుక్రవారం, 21 నవంబరు 2025 (15:10 IST)
Sai pallavi
ఇటీవలి పూజా హెగ్డేకు తెలుగు సినిమాలో పెద్ద ఆఫర్లు దొరకడం లేదు. ఆమె టాలీవుడ్ కెరీర్ మందగించింది. తమిళ పరిశ్రమ ఆమెకు కొత్త అవకాశాలను రావడంతో ఫ్యాన్స్ మళ్ళీ ఆశలు పెట్టుకున్నారు. ఆమె ప్రస్తుతం విజయ్‌తో కలిసి జన నాయగన్‌లో నటిస్తోంది. అలాగే లారెన్స్ కాంచన-4లో కూడా ఆమె కీలక పాత్రకు సంతకం చేసినట్లు టాక్ వస్తోంది. 
 
అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించే ధనుష్ తదుపరి చిత్రానికి కూడా పూజా పేరును పరిశీలించినట్లు సమాచారం. ప్రారంభ చర్చలు బాగానే జరిగాయని సమాచారం. అయితే, చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోయాయి. పూజ స్థానంలో సాయి పల్లవిని మేకర్స్ తీసుకున్నారు. 
 
దీంతో పూజా హెగ్డేకు చేతికి వచ్చిన ఛాన్స్ చేజారిపోయింది. తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలో కూడా అవకాశాలు సన్నగిల్లుతున్నాయని సినీ పండితులు అంటున్నారు. ఇక సాయి పల్లవి గతంలో మారి 2లో ధనుష్‌తో కలిసి పనిచేసింది. వారి రౌడీ బేబీ పాట భారీ పాన్ ఇండియా హిట్ అయింది. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం రామాయణంపై దృష్టి పెట్టింది. ఇందులో ఆమె సీత పాత్ర పోషిస్తుంది. 
 
ఈ కారణంగా ఆమె థండేల్ తర్వాత ఎక్కువ తెలుగు లేదా తమిళ చిత్రాలకు సంతకం చేయలేదు. అయినప్పటికీ ఆమె ధనుష్ 55వ చిత్రానికి అంగీకరించింది. ఇకపోతే.. పూజా హెగ్డే ప్రస్తుతం జన నాయగన్, కాంచన 4, వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న బాలీవుడ్ చిత్రం హై జవానీ తో ఇష్క్ హోనా హై కోసం ఎదురు చూస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్.. జీవోను జారీ చేసిన తెలంగాణ సర్కారు

పెళ్లి చేసుకోబోతున్న మరిది ప్రైవేట్ పార్టును కత్తిరించిన వొదిన, ఎందుకు?

Mother : ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. 11 రోజుల నవజాత శిశువును అమ్మేసిన తల్లి

సినిమా వాళ్లు ఏమన్నా సంసారులా? ఐ బొమ్మ రవి దమ్మున్నోడు: తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments