యాంకర్ అనసూయ సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. యాంకరింగ్‌తో పాటు అనసూయ సినిమాల వేగం బాగా పెంచింది. రంగమ్మత్త వంటి విభిన్నమైన పాత్రలో కనిపించిన అనసూయ, తన తర్వాతి పాత్రల్లో కూడా వైవిధ్యం ఉండేలా చూసుకుంటుంది.
తాజాగా థ్యాంక్యూ బ్రదర్ చిత్రంలో గర్భిణీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పుడిప్పుడే స్పీడ్ పెంచుతున్న అనసూయ..కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో, రవితేజ హీరోగా వస్తోన్న కిలాడిలో కీలక పాత్రలు పోషిస్తోంది. అలాగే థ్యాంక్ యు బ్రదర్ అనే సినిమాలో ఏకంగా గర్భవతిగా నటిస్తూ అందర్నీ షాక్‌కు గురి చేసింది. అది కాకుండా సినిమా మొత్తం అలాగే ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఇక తమిళంలోనూ ఎంట్రీ ఇస్తుంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో అనసూయ ఓ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఆ పాత్ర వివరాలు, సినిమా పేరు వగైరా బయటపెట్టనప్పటికీ, తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది. 80,90లల్లో ఐటమ్ సాంగ్స్‌లో ఉర్రూతలూగించిన సిల్మ్ స్మిత గెటప్‌లో అనసూయ కూర్చుని ఉంది. బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో అచ్చం సిల్క్ స్మిత లాగే కనిపిస్తుంది.
సిల్క్ స్మిత బయోగ్రఫీలో అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ''మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం ప్రారంభించాను" అంటూ ఓ లుక్‌ను షేర్ చేసింది. అందులో సిల్క్ స్మితను ఆధారంగా చేసుకుని ఈ లుక్‌ను డిజైన్ చేశారు అని చెప్పుకొచ్చింది. అంటే మొత్తానికి మరో సారి సౌత్ మొత్తాన్ని తన అద్భుతమైన నటనతో అదరగొట్టేందుకు అనసూయ రెడీ అవుతోందని తెలుస్తోంది.