పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించనున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్‌తో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవర్ స్టార్, సూపర్ స్టార్ త్వరలో మల్టీస్టారర్ సినిమాలో కనిపించనున్నారు. ఈ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
కాకపోతే, అది పూర్తిస్థాయిలో కాదు కేవలం కొంతసమయం మాత్రమేనట. మహేశ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న 'సర్కారువారి పాట'లో పవన్ అతిథిగా కనిపించనున్నారట. పవన్ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్ర్కీన్‌పై మెరవనున్నారట.
ఈ మేరకు పలు పోస్టర్లు, పోస్టులు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సదరు వార్తలు చూసిన ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నాటి తమ కల నిజమైతే బాగుండని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. పవన్‌కల్యాణ్ నటించిన 'జల్సా'కు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.