అనసూయ గారూ, పెళ్లైన మీకిది అవసరమా? అంటూ నెటిజన్ కామెంట్, రంగమ్మత్త ఘాటు రిప్లై

శనివారం, 7 డిశెంబరు 2019 (16:31 IST)
జబర్దస్త్ షోతో అనసూయ బాగా పాపులరైన సంగతి తెలిందే. ఆ తర్వాత ఆమె అనేక గేమ్ షోలు నిర్వహించారు. రామ్ చరణ్ సూపర్ హిట్ చిత్రం రంగస్థలం చిత్రంలో చెర్రీకి అత్తగా నటించిన అనసూయ రంగమ్మత్తగా ఇంకా పాపులరయ్యారు. ఇదిలావుంటే, అనసూయ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యాక్టివ్ గా వుంటారు. 
 
తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్లో ఫోటోలను షేర్ చేసింది అనసూయ. ఈ ఫోటోలను చూసిన ఓ నెటిజన్... అనసూయ గారు మీకు పెళ్లైంది, మీకు ఇవన్నీ అవసరమా? అంటూ ప్రశ్నించాడు. దీనితో రంగమ్మత్తకు కోపం వచ్చేసింది. సదరు వ్యక్తికి రిప్లై ఇస్తూ, జగదీష్ గారు మీకు బుర్రలేదు, మీకు ఇలా నాతో మాట్లాడటం అవసరమా అండి? అంటూ ఘాటుగా స్పందించింది.

 

Jagadeesh garu.. meeku burra ledu.. meeku ila naato maatladatam avasarama cheppandi. https://t.co/2R58YFF0Uk

— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 7, 2019

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పీకేను మళ్లీ కదిలించిన పూనమ్ కౌర్.. ఫ్యాన్స్ ట్రోల్‌తో డిలేట్ చేసేసింది..