డెంగ్యూతో జూ.బాలకృష్ణ మృతి: కన్నీటి పర్యంతమైన యాంకర్ అనసూయ

శుక్రవారం, 18 అక్టోబరు 2019 (16:06 IST)
జూనియర్ బాలకృష్ణగా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ సాయికృష్ణ డెంగ్యూ జ్వరం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. గోకుల్ సాయి మరణ వార్తపై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉద్వేగానికి లోనయ్యారు. తామంతా సాయికృష్ణను జూనియర్ బాలకృష్ణ అని పిలుచుకునేవారమని గుర్తు చేసుకున్నారు. 
 
అతడి మరణ వార్తను జీర్ణించుకోవడం సాధ్యం కావడంలేదంటూ ఉద్వేగానికి లోనైంది. డెంగ్యూ జ్వరం చాలా భయంకరమైనదని ఆమె చెప్పింది. గోకుల్ కుటుంబానికి ఇది తీరని లోటనీ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
 
ప్రతి ఒక్కరూ డెంగ్యూ గురించి తెలుసుకోవాలనీ, జాగ్రత్తగా ఉండాలని సూచించింది అనసూయ. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం కోసం వెళ్లడం కంటే అసలు డెంగ్యూ రాకుండా నివారణ మంచిదని చెప్పారు. డెంగ్యూ దోమలు లేకుండా చేసేందుకు ప్రభుత్వ అధికారులందరూ చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నేహా కక్కర్‌కు చేదు అనుభవం.. బుగ్గపై ముద్దెట్టిన అభిమాని