Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌.. కొరటాల సినిమాలో మురారి హీరోయిన్?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (12:10 IST)
ఎన్టీఆర్‌.. కొరటాల శివ చిత్రంతో పాటు 'ఉప్పెన' ఫేమ్‌ బుచ్చిబాబు సానాతో కూడా మరో సినిమా చేయనున్నారని కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే నెల 11న అధికారికంగా ప్రకటన వెలువడనుందని టాక్ వస్తోంది. 
 
క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కబడ్డీ ఛాంపియన్‌గా కనిపించనున్నారు. 
 
కోచ్‌గానూ ఆయన తెరపై సందడి చేయనున్నారని తెలిసింది. 'పెద్ది' అనే వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా సన్నద్ధం కానున్నట్టు తెలిసింది.  
 
ఈ సినిమా ద్వారా సోనాలీ బింద్రే రీ ఎంట్రీ ఇవ్వనుంది. దాదాపు 18ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. తారక్​-కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఆమెను సంప్రాదించారట. 
 
పాన్​ ఇండియా ప్రాజెక్ట్​ అవ్వడం, కథ నచ్చడం వల్ల ఆమె కూడా దీనికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
 
ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments