Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-02-2022 నుంచి 19-02-2022 వరకు మీ వార రాశిఫలితాలు

Advertiesment
13-02-2022 నుంచి 19-02-2022 వరకు మీ వార రాశిఫలితాలు
, శనివారం, 12 ఫిబ్రవరి 2022 (21:20 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొన్ని సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. విమర్శలు మీలో పట్టుదలను రేకెత్తిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, సోమ వారాల్లో పనులు సాగవు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. రిప్రజెంటేటిలకు ఒత్తిడి అధికం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. కొంతమంది మిమ్ములను నిరుత్సాహపరుస్తారు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. బుధవారం నాడు ఊహించని ఖర్చలుంటాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సంతకాల విషయంలో జాగ్రత్త. గృహమార్పు అనివార్యం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిన్న వ్యాపారులకు కష్టకాలం. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. అధికారులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
మిథునం :మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. సొంత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పెట్టుబడులకు సమయం కాదు. గురు, శుక్ర వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు. ధరలు ఆందోళన కలిగిస్తాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. బుధ, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సందేశాలు, ప్రకటనలను నమ్మవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. బిల్డర్లు, కార్మికులకు నిరాశాజనకం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వేడుకకు హాజరవుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. ఆదివారం నాడు ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ప్రయాణు లక్ష్యం నెరవేరుతుంది. 
 
కన్య, ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు సానుకూలమవుతాయి. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. పెట్టుబడులకు అనుకూలం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టం ఫలిస్తుంది. వ్యవహారాలు మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు.సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. సంతాన సౌఖ్యం, వస్త్రప్రాప్తి పొందుతారు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు గురి కావద్దు. అపరిచితులు మోసగించే ఆస్కారం ఉంది. గృహమార్పు అనివార్యం. ఆప్తులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఫర్వాలేదనిపిస్తాయి. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఈ వారం సర్వత్రా అనుకూలమే. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వాగ్దాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం కొందరికి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలున్నాయి. అకౌంట్స్, రిప్రజెంటేటిలకు పనిభారం, విశ్రాంతి లోపం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పిడి కలిసివస్తుంది. వ్యాపార ఒప్పందాల్లో మెలకువ వహించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. కొంత మొత్తం ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపులో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. సోమ, మంగళ వారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. కుటుంబీకుల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పోగొట్టుకున్న వస్తువు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు అధికారులతో కొత్త సమస్యలెదురవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. ఎనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బుధ, గురు వారాల్లో అనవసర జోక్యం తగదు. పొగిడిన వారే విమర్శించేందుకు వెనుకాడరు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సంతానం దూకుడు అదుపుచేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
పంతాలు, పట్టుదలకు పోవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. శుక్ర, శని వారాల్లో పనులతో సతమతమవుతారు. మీపై శకునాల ప్రభావం అధికం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. గత అనుభవాలు ఉల్లాసాన్నిస్తాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రయాణం విరమించుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రూజ ఒత్తిళ్లు తొలగుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆది, గురు వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం. బిల్డర్లకు కష్టకాలం. స్టాకిస్తులు, హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం రోజున జయ ఏకాదశి.. పూజ ఇలా చేస్తే సర్వం శుభం