Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-01-2022 నుంచి 29-01-2022 వరకు మీ వార ఫలితాలు

Advertiesment
23-01-2022 నుంచి 29-01-2022 వరకు మీ వార ఫలితాలు
, శనివారం, 22 జనవరి 2022 (20:34 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
అన్ని రంగాల వారికి శుభదాయకం. లక్ష్యం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. పదవులు బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. రిప్రజెంటేటిన్లు టార్గెట్లను పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. మనోధైర్యంతో వ్యవహరించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్తలు వింటారు. మంగళ, బుధ వారాల్లో ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వినియోగిస్తారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. గృహమార్పు కలిసివస్తుంది. వృత్తుల వారికి నిరుత్సాహకరం. ఉపాధి పథకాలు సంతృప్తినీయవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
వ్యవహారాలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆత్మీయులరాక ఉపశమనం కలిగిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. శుక్ర, శని వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహమార్పు అనివార్యం. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో శ్రమించినగాని పనులు సాగవు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. ఆదివారం నాడు చికాకు కలిగించే సంఘటనలెదురవుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. దంపతుల మధ్య సఖ్యత లోపం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు స్వాగతం పలుకుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
అనుకూలతలు అధికంగా ఉన్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. పరిచయాలు ఉన్నతికి సహకరిస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. మంగళ వారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆత్మీయులకు వివాహ సమాచారం అందిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వేడకకు సన్నాహాలు సాగిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలు, స్వచ్ఛంద సంస్థలకు సాయం అందిస్తారు. మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
సత్తా చాటుకుంటారు. మీ సామర్థ్యం ఎదుటివారికి తెలిసివస్తుంది. అవకాశాలను అందుకుంటారు. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యతిరేకుల వైఖరిలో మార్పు వస్తుంది. పదవులు అందుకుంటారు. హామీలిచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. బుధ, గురు వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వ్యవహరాలను సమర్థంగా నిర్వహిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. వాగ్వాదాలకు దిగవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సానుకూలంగా పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శని వారాల్లో పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వాస్తుకు అనుగుణంగా గృహంలో మార్పులు అనివార్యం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
మీ శ్రమ ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. సన్నిహితులకు సాయం అందిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధ్యాయులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ప్రతికూలతలు అధికం. ఓర్పుతో వ్యవహరించాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బుధవారం నాడు కొత్త సమస్యలెదురవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. ప్రియతముల రాకతో కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి. గృహమార్పు నిదానంగా కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. బంధువుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. ప్రయాణం లక్ష్యం నెరవేరుతుంది. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. ఎవరినీ నిందించవద్దు. మాటతీరు అందుపులో ఉంచుకోండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధనపహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు కష్టసమయం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఈ వారం కలిసివచ్చే సమయం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తిరరం. వాహనం, గృహోపరరణాలు కొనుగోలు చేస్తారు. పనుల సానుకూలతరు మరింత శ్రమంచాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహిచండి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు శుభయోగం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-01-2022 శనివారం రాశిఫలితాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...