Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-01-2022 నుంచి 08-01-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

Advertiesment
02-01-2022 నుంచి 08-01-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)
, శనివారం, 1 జనవరి 2022 (16:40 IST)
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. పరిస్థితులు అనుకూలిస్తాయి. మానసికంగా కుదుటపడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఖర్చులు విపరీతం. కొంత మొత్తం ధనం అందుతుంది. మీ శ్రీమతి వైఖరిని గమనించి మెలగండి. బుధవారం నాడు ఒత్తిడి, ఆందోళన అధికం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. పోటీల్లో విజయం సాధిస్తారు.
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
మీ ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం. మితంగా సంభాషించండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. గురు, శక్ర వారాల్లో ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. అధికారులకు హోదామార్పు. స్థానచలనం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. 
 
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడతారు. సామరస్యంగా మెలగాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆప్తుల సలహా పాటించండి. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. జూదాలు, బెట్టింగ్ జోలికి పోవద్దు.
 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఖర్చులు భారమనిపించవు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు. 
 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
అన్ని రంగాల వారికి అనుకూలదాయకమే. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. జాతక పొంతన ప్రధానం. స్థిరచరాస్తుల క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 23 పాదములు 
వ్యవహారాలు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. వృ, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. కళాత్మక పోటీల్లో మహిళలు రాణిస్తారు. ఆలయాల సందర్శనం ఉల్లాసాన్నిస్తుంది. 

 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గురువారం నాడు ఒక సంఘటన తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆధ్యాత్మిక, యోగా విషయాలపై దృష్టి సారిస్తారు. నిర్మాణాలు, మరమ్మతులు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శుక్ర, శని వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచలు స్ఫురిస్తాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆస్తి కోర్టు వ్యవహారాలు కొలిక్కివస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. క్రీడా, కళాత్మక పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
 
మకరం , ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయం పై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆది, మంగళ వారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. ఆత్మీయుల హితవు మీపై సత్రభావం చూపుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. హోల్సేల్ వ్యాపారాలు ఏమంత సంతృప్తినీయవు. చిన్న వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. సహోద్యోగుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థికస్థితి సామాన్యం, ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా పాటించండి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతకు గురవుతాయి. పనివారల వైఖరి అసహనం కలిగిస్తుంది. ఎవరినీ నిందించవద్దు. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. పోటీలు, పందాల్లో పాల్గొంటారు. 
 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు మీదైన రంగంలో విజయం సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పదవులు, బాధ్యతల స్వీకరణకు అనుకూలం. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆది, సోమ వారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అపరిచితులతో జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెలకువ వహించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తులు, కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-01-2022 శనివారం దినఫలాలు - లక్ష్మీనారాయణస్వామిని ఎర్రని పూలతో...