Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-12-2021 నుంచి 18-12-2021 వరకు మీ రాశిఫలాలు (video)

Advertiesment
12-12-2021 నుంచి 18-12-2021 వరకు మీ రాశిఫలాలు (video)
, శనివారం, 11 డిశెంబరు 2021 (21:54 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆది, సోమవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. గృహమార్పు అనివార్యం. వస్త్ర, పచారీ వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు. స్థానచలనం. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. కష్టించినా ఫలితం ఉండదు. మీ సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మంగళ, గురు వారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వృత్తుల వారికి ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. న్యాయ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
పట్టుదలతో యత్నాలు సాగించండి. సన్నిహితులు ప్రోత్సాహం అందిస్తారు. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బుధవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. కార్మికులకు పనులు లభిస్తాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి, వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త, వాహనదారులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. గురు, శుక్ర వారాల్లో విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉపాధి అవకాశాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం సంతృప్తికరం. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. మంగళ, బుధ వారాల్లో ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతగా మెలగండి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 23 పాదములు 
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి మానసికంగా కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. పెట్టుబడులకు తగిన సమయం. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ఆది. గురువారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. గృహమార్పు సత్ఫలితాన్నిస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. మీ వాక్కు ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. రాజీమార్గంలో వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన లోపు. వసులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. అప్పులకు ముఖ్య సమాచారం అందిస్తారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలెదురవుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు,
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఈ వారం ప్రతికూలతలు అధికం. ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు, పెద్దల సలహా పాటించండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు సామాన్యం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహమార్పు చికాకు పరుస్తుంది. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
స్వయంకృషితో రాణిస్తారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆది, సోమ వారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వేడుకకు హాజరవుతారు. సంతానం ధోరణి అసహనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తులకు పనిభారం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. స్పెక్యులేషన్ లభిస్తుంది.
 
మీనం : పూర్వాబాధ్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
గ్రహస్థితి అనుకూలం. అన్ని రంగాల వారికీ బాగుంటుంది. సమస్యలు సద్దుమణుగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మంగళ, బుధవారాల్లో ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు హోదా మార్పు, వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-12-2021 శనివారం రాశిఫలాలు : అనంతపద్మనాభస్వామిని పూజించిన...