మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. శనివారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు ప్రారంభిస్తారు. కలిసి వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టకాలం. భవన నిర్మాణ కార్మికులకు ఆదాయాభివృద్ధి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆప్తుల సలహా పాటించండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆది, సోమ వారాల్లో విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారారులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశాజనకం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గురు, శుక్ర వారాల్లో కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తాయి. పనులు ముందుకు సాగవు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ ఇష్టాయిష్టాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఎవరినీ నిందించవద్దు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వేడుకు సన్నాహాలు సాగిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మంగళ, బుధ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు వేగవంతమవుతాయి. పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కార్మికులకు పనులు లభిస్తాయి. రిప్రజెంటేటికు ఒత్తిడి అధికం.
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనయోగం, వస్తులాభం ఉన్నాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తులకు అందిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకాంనికి అనుకూలం. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య అరమరికలు తగవు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. నగదు తీసుకునేటపుడు జాగ్రత్త సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త ఉద్యోగస్తులకు యూనయలో గుర్తింపు లభిస్తుంది. న్యాయ, వైద్య సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి విదేశీయాన యత్నం ఫలిస్తుంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఈ వారం కలిసివచ్చే కాలం. అనుకున్నది సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆగిపోయిన పనులు పున ప్రారంభిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులతో జాగ్రత్త. కొంతమంది మీ యత్నాలకు అడ్డుపడతారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ మంటపాలు అన్వేషిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1 2 3 పాదములు
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. తొందరపాటు నిర్ణయాలు తగవు. పనులు చురుకుగా సాగుతాయి. ఆదివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త వాగ్వాదాలకు దిగవద్దు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. సంప్రదింపులకు అనుకూలు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కాంట్రాక్టర్లు, కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాడు. సోదరీసోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సోమ, మంగళ వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు స్వాగతం పలుకుతారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 23 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. రుణ ఒత్తిళ్లు మనశ్సాంతి లేకుండా చేస్తాయి. బుధవారం నాడు పనులు అప్పుంచవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దుబారా ఖర్చులు విపరీతం చేతిలో ధనం నిలవదు. ధైర్యంగా మెలగండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. అవసరానికి సన్నిహితుల సాయం అందిస్తారు. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడి పై దృష్టి పెడతారు. వివాహయత్నం నిరుత్సాహపరుస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. శుక్ర, శని వారాల్లో ఒత్తిడి, ఆందోళన అధికం, ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. గృహ మరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రముఖులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు.
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. కొన్ని సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆది, బుధ వారాల్లో వ్యవహారాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగారుస్తారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. మనోధైర్యంతో మెలగండి. మీ శ్రీమతి లేక శ్రీవారి ధోరణిలో మార్పు వస్తుంది, ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. జూదాల జోలికి పోవద్దు.
మీనం : పూర్వాబాధ్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహ మరమ్మతులు చేపడతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. రిటైర్లు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.