ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సేవాదాత, వ్యాపారవేత్త సుధా రెడ్డి మరోసారి తన ఉదాత్తమైన మనసును చాటారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్న 100 మంది క్యాన్సర్ బాధిత రోగుల కుటుంబాలకు అవసరైన వస్తువులు, ఆహార పదార్థాలతో కూడిన కేర్ కిట్‌లను ఆమె పంపిణీ చేశారు.
అనంతరం 70 మంది క్యాన్సర్ బారిన పడిన పిల్లలకు బొమ్మలు, టిఫిన్ బాక్స్‌లు, స్టేషనరీ, దుప్పట్లను పంపిణీ చేశారు.
ఇటీవల జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పార్క్‌లేన్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆత్మరక్షణ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రాథమిక అంశాలపై ఆమె 50 మంది నిరుపేద బాలికలకు వర్క్‌షాప్ నిర్వహించారు.