Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషానికి హోమం చేయనున్న ఆదిపురుష్ మేకర్స్

Webdunia
సోమవారం, 17 మే 2021 (13:39 IST)
Adipurush (tw-fan)
పురాణ ఇతిహాస చిత్రాలు, అందులోని పాత్ర‌లు పోషించాలంటే ఎన్‌.టి.ఆర్‌., ఎ.ఎన్‌.ఆర్‌. కాలంలో పూర్తిగా నియ‌మ నిష్ట‌ల‌తో చేసేవారు. ఇప్పుడు తాము నిర్మిస్తున్న ఆదిపురుష్ కూడా అలా చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఎందుకంటే ఆదిపురుష్ సెంటిమెంట్ ప‌రంగా ముంబైలో సెట్ వేసి ప్రారంభించారు. ఆదిలోనే అది కాలిపోయింది. కానీ సెంటిమెంట్ గురించి వారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఆ త‌ర్వాత ఇప్ప‌టి క‌రోనా సెకండ్‌వేవ్ వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల ఓ ఆథ్యాత్మిక గురువు ఇచ్చిన స‌ల‌హాతో ఆదిపురుష్ నిర్మాత‌లు సినిమాకు దోషాలు ఏమైనా వుంటే పోవ‌డానికి హోమం చేయ‌బోతున్నారని తెలుస్తోంది.
 
ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్‌. రామాయ‌ణం ఇతిహాసం ఆధారంగా 3డీ ఫార్మాట్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి మొద‌టి నుండి స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ వివాదం , షెడ్యూల్ కాస్త గాడిలో పడింది అనుకున్న సమయానికి ముంబైలో లాక్ డౌన్ పెట్ట‌డం దీంతో షూటింగ్ వాయిదా ప‌డ‌డం జ‌రిగింది.ఇక హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రీన్ మ్యాట్‌లో చేయాల‌ని నిర్ణ‌యించుకునే స‌రికి ఇక్క‌డ కూడా లాక్‌డౌన్ పెట్టేశారు. దీంతో షూటింగ్ మ‌ళ్లీ వాయిదా ప‌డింది. 
 
ఆదిపురుష్ అనేది రామాయణం సంభందించిన సబ్జెక్టు కదా,.ఆ వైపు నుంచి ఏదన్నా దోషం ఉందేమోన‌ని నిర్మాత‌లు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దోషం తొల‌గిపోయేందుకు హోమం చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా ‘ఆదిపురుష్’లో సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు. అంగద్ బేడీ ఇంద్రజిత్ గా లక్ష్మణుడి పాత్రకు సోనూకి టిటులీ ఫేం.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ని ఎంపిక చేశారు. 300 కోట్ల వ్యయంతో టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మ‌రి అన్నీ స‌వ్యంగా జ‌ర‌గాలంటే నియ‌మాలు పాటించాల్సిందేన‌ని ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు తెలియ‌జేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments