కరోనా కారణంగా రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సి.ఎం. రిలీఫ్ పండ్ కింద ప్రముఖులనుంచి వితరణ ఆహ్వానించింది. ఇందుకు నిమిత్తం గత కొద్దిరోజులుగా హీరోలు కొందరు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇదేదికంగా సాయం చేస్తున్నారు. సోమవారంనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు 50 లక్షలను అందజేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ షేర్ చేసుకున్నారు.
Sowndarya (tw)
కాగా, రెండు రోజులకు ముందే సౌందర్య రజనీకాంత్ తన కుటుంబంతో వెళ్ళి సి.ఎం. స్టాలిన్‌కు కలిశారు. ఆమె తన ట్వీట్‌లో, తన మామగారి సహకారం వారి ఫార్మా కంపెనీ అపెక్స్ లాబొరేటరీస్ నుంచి వచ్చినట్లు పేర్కొంది. సౌందర్య, ఆమె భర్త విశగన్, బావ వనంగముడి, ఆమె బావ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కలిసినవారిలో వున్నారు.