చాలా మంది దర్శకులు హీరోను బేస్‌చేసుకుని కథలు రాస్తుంటారు. మరికొందరు కథలు రాసుకున్నాక హీరో ఎవరైతే సరిపోతారో వారితో సినిమా చేస్తుంటారు. అలా చేసిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల వంటి కొందరిని వేళ్ళమీద లెక్కించవచ్చు. అలాంటి కోవలోని వాడే చంద్రశేఖర్ యేలేటి. ఐతే సినిమా నుంచి నితిన్‌తో చెక్ సినిమా వరకు ఆయన రాసుకున్న కథలు తీసిన సినిమాలు నిదర్శనం. ఈ విషయంలో చాలాసార్లు ఆయన నేను కథ రాసుకున్నాక హీరో గురించి ఆలోచిస్తానని అనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చాడు. అది కూడా ఎవరికోసం అనుకుంటున్నారా, ప్రభాస్ కోసం.
ఆయన దర్శకత్వంలో సక్సెస్ రేటు తక్కువే అయినా ఆయన ప్యూచర్ గురించి బాగా ఆలోచిస్తాడని, మేథావి పరిశ్రమలో టాక్ వుంది. చెక్ సినిమా తర్వాత ఏ తరహా సినిమా చేస్తారని అడిగినప్పుడు పాన్ ఇండియా మూవీ అని తేటతెల్లం చేశాడు. అయితే ఆ కథ ఇప్పటికి సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందికూడా ప్రభాస్‌కు సరిపడా కథే అట. ఈ కథను త్వరలో ఆయనకు వినిపిస్తానని ఆయన అంటున్నారు. ఎందుకంటే యేలేటి, రాజమౌళి కుటుంబానికి సన్నిహితుడు కూడా. అందుకే ప్రభాస్‌కు కథ చెప్పడం పెద్ద కష్టం కానేకాదు. అయితే ఇప్పటికే ప్రభాస్ నాలుగు సినిమాల్లో బిజీగా వున్నాడు. మరి లాక్‌డౌన్ కాబట్టి ఈ కథను సిద్ధం చేసుకుని ప్రభాస్‌కు వినిపించనున్నాడని సమాచారం.