Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

ఠాగూర్
సోమవారం, 7 జులై 2025 (12:31 IST)
తాను రెండో పెళ్లి చేసుకునేందుకు మానసికంగా తాను సిద్ధంగానే ఉన్నానని, కానీ దానికి మరికొన్ని సంవత్సరాల సమయం పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, సినీ నటి రేణూ దేశాయ్ వ్యాఖ్యానించారు. 
 
తాజాగా తన రెండో పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ, మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని, అయితే ఆ నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. ఈ వ్యాఖ్యలతో తన వ్యక్తిగత జీవితంపై సాగుతున్న ఊహాగానాలకు ఆమె ప్రస్తుతానికి తెరదించారు.
 
పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా నందన్, ఆధ్యాలతో కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె రెండో పెళ్లి అంశం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. "రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. కానీ, మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపారు.
 
ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని పిల్లల పెంపకానికే కేటాయిస్తున్నానని, వారి భవిష్యత్తుకే తన మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి తప్పకుండా ఆలోచిస్తానని చెప్పడం ద్వారా వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు తాను సానుకూలంగానే ఉన్నట్లు రేణు దేశాయ్ సంకేతమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments