Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

Advertiesment
nidhi agarwal

ఠాగూర్

, ఆదివారం, 6 జులై 2025 (18:27 IST)
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్‌తో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన "హరిహరి వీరమల్లు" చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆమె జ్యోతి స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
"సవ్యసాచి" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన నిధి అగర్వాల్... "ఇస్మార్ట్" శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు కీలకమైన ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి 'హరిహర వీరమల్లు' కాగా, రెండోది ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' చిత్రం. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు సినిమాల విజయం తన కెరీర్‌కు ఎంతో ముఖ్యమని భావిస్తున్న నిధి... వాటి సక్సెస్ కోసం ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారని ప్రచారం సాగుతోంది. 
 
నిధి అగర్వాల్ వేణు స్వామిని సంప్రదించడం ఇది తొలిసారి కాదు. గతంలో ఆయన సలహాలు, సూచనలు పాటించిన తర్వాతే ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయని, కెరీర్ గాడిన పడిందన్న టాక్  చిత్రపరిశ్రమలో ఉంది. మళ్లీ అదే సెంటిమెంట్‍‌తో సినిమా విడుదలకు ముందు పూజలు చేయించారని భావిస్తున్నారు. 
 
కాగా, గతంలోనూ సినీ సెలెబ్రిటీలు రష్మిక మందన్నా, డింపుల్ హయతి, అషు రెడ్డి వంటి పలువురు తారలు కూడా వేణు స్వామి కలవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిధి పూజల వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. పూజలు చేస్తే సినిమాలు హిట్ అవుతాయా అని కొందరు ప్రశ్నిస్తుంటే, వేణు స్వామి టైమ్ మళ్లీ మొదలైంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత