Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

Advertiesment
Pawan kalyan

ఠాగూర్

, శుక్రవారం, 4 జులై 2025 (19:13 IST)
వైకాపాపై జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోమారు మాటల తూటాలు పేల్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడమని, 2029లో మీరెలా అధికారంలోకి వస్తారో చూస్తామని అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, రంపాలు తెస్తాం, కత్తులు కోస్తాం వంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. గత పాలకుల్లో ఇంకా రౌడీయిజం, గుండాయిజం చేయాలన్న ఆలోచనలు కనిపిస్తున్నాయని, సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టంచేశారు. 
 
ప్రస్తుతం 11 సీట్లు గెలిచిన మీకు మేము గౌరవం ఇస్తున్నాం. మా పాలనలో ఏమైనా తప్పులుంటే చెప్పండి... సరిచేసుకుంటాం. అంతేగానీ బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం అని అన్నారు. గతంలో వైకాపాకు 151 సీట్లు వచ్చి తాను రెండు రెండూ చోట్లా ఓడిపోయినపుడే ధైర్యంగా నిలబడి పోరాడమని పవన్ గుర్తు చేశారు. అలాంటి మమ్మల్ని ఎదుర్కోవడానికి ఎంత దమ్ము కావాలో ఆలోచించండి. ఇపుడు 2029లో మా అంతు చూస్తామంటున్నారు. అసలు అప్పటికి మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చేస్తాం అంటూ సవాల్ విసిరారు. తనకు వైకాపాలోని ఓ ఒక్కరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని, కానీ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక