Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరు... వైఎస్. షర్మిల

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (14:02 IST)
పుట్టింటి మీద అలిగి ఏ ఒక్కరూ రాజకీయ పార్టీలు పెట్టరని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల వ్యాఖ్యానించారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖ‌ర్‌ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె స్పష్టం చేశారు. 
 
ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్‌ తెలంగాణకు మంచి చేశారా.. ద్రోహం చేశారా అనే విషయాన్ని గ్రామాలకు వెళ్లి అడగాలని అన్నారు. వైఎస్‌ చనిపోయాకే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేసిన షర్మిల, యూపీఏ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చారని తెలిపారు. తన తండ్రి ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజల కోసం నిలబడే.. పోరాడే పార్టీ వైఎస్సార్‌ టీపీ అని స్పష్టం చేశారు.  
 
అలాగే, పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఈ పార్టీ స్థాపించామన్నారు. కృష్ణా జలాల అంశాలను కేసీఆర్‌ ఏనాడైనా సీరియస్‌గా తీసుకున్నారా అని ప్రశ్నించారు. 
 
తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును వదులుకోమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో ఎంత మంది మహిళలున్నారని.. మీటింగ్‌ జరిగితే మహిళా సర్పంచ్‌కు కూడా కుర్చీ ఇవ్వరని విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలని, వ్రతాలు చేసుకోవాలి షర్మిల అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments