Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడితో వివాహేతర సంబంధం.. ఆపై ఆత్మహత్య.. ఎందుకంటే?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (09:52 IST)
వరుసకు అల్లుడు అయినా ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ వ్యవహారం ఎక్కడ బయటపడుతోందని ఆందోళన చెందిన ఆ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్, వంపుతండాకు చెందిన దేవమ్మ(30, పార్వతమ్మ)కు అదే తండాకు చెందిన రాజుతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 
 
భర్త డోజర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భర్త లేని సమయంలో అదే తండాకు చెందిన శివనాయక్ ‌(22) వరుసకు అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి తండాలో కొంత మంది చర్చించుకున్నారు. తమ వివాహేతర సంబంధం ఎక్కడ బయట పడుతుందోనని ఆందోళన చెందింది. శుక్రవారం రాత్రి ఇద్దరూ కొన్నూరు క్రాస్‌ రోడ్డు వద్ద పెద్దతొక్కుడోని బండపై పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
 
అటుగా పొలాల వైపు వెళ్లిన రైతులు వీరిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్‌ సాయంతో వీరిని చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌ తీసుకెళ్తుండగా.. ఇద్దరూ మార్గమధ్యంలో మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ - ప్రైమ్ మనీ ఎంతో తెలుసా?

మంచు మనోజ్ ఇంటి జనరేటర్‌లో చక్కెర పోసిన మంచు విష్ణు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments