Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పచ్చటి కాపురం, చాక్లెట్ ఇచ్చి వివాహితను లోబరుచుకుని చివరకు..?

Advertiesment
పచ్చటి కాపురం, చాక్లెట్ ఇచ్చి వివాహితను లోబరుచుకుని చివరకు..?
, సోమవారం, 6 జులై 2020 (22:41 IST)
గుంటూరు జిల్లా. రోజా, రమేష్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమేష్ తాపీమేస్త్రీ. రోజా కూలి పనిచేసేది. వీరికి ఇద్దరు పిల్లలు. కుటుంబం సాఫీగానే సాగుతోంది. అయితే అక్కడే పనిచేసే మరో మేస్త్రీ వెంకటేష్ కారణంగా వారి కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమైంది.  
 
రమేష్ తాపీమేస్త్రీగా ఒక చోట పనిచేస్తుంటే రోజా మరొక చోట కూలిగా పనిచేస్తూ ఉండేది. రోజా పనిచేసే చోటే వెంకటేష్ మేస్త్రీగా ఉండేవాడు. మొదట్లో వీరు స్నేహితులుగా మాత్రమే ఉండేవారు. రోజాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. వెంకటేష్ రోజాకు ప్రతిరోజూ చాక్లెట్లు కొనివ్వడంతో పాటు ఆమెకు ఇష్టమైన ఫుడ్‌ను తినిపించి బాగా దగ్గరయ్యాడు.
 
పని పూర్తయిన తరువాత స్కూటర్ పైన తిప్పడం బాగా అలవాటు చేశాడు. దీంతో కుటుంబాన్ని గాలికొదిలేసింది రోజా. భర్తను సరిగ్గా పట్టించుకోలేదు. విషయం కాస్త రమేష్‌కు తెలిసింది. భార్యను మందలించాడు. ఇక తప్పు చేయనని భర్తను హామీ ఇచ్చింది.
 
అయితే రెండురోజులకే వెంకటేష్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. కరోనాకు ముందు వీరు హైదరాబాద్‌కు వెళ్ళారు. మూడునెలల పాటు అక్కడే ఉన్నారు. అయితే పిల్లలు గుర్తుకు రావడంతో రోజా తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది.
 
కానీ వెంకటేష్ ఒప్పుకోలేదు. కోపంతో ఊగిపోయాడు. రోజాను అతి దారుణంగా చంపి హైదరాబాద్ లోని ఉప్పల్ శివార్లలో పడేసి వెళ్లిపోయాడు. నిన్న ఉప్పల్ పోలీసులకు స్థానికులు అందించిన సమాచారంతో రోజా డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనీస్ యాప్స్ నిషేధం: 12 మిలియన్లకు పైగా కొత్త డౌన్‌లోడ్‌లను నమోదుతో ట్రెల్ రికార్డు