Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు తీసుకున్న మహిళ వేరొక వ్యక్తితో బైకుపై వెళ్తే.. చివరికి ఏం జరిగిందంటే?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (20:56 IST)
విడాకులు తీసుకున్న మహిళ... పుట్టింటి వద్దే వుంటోంది. ఏదో బ్యాంకు పని మీద తెలిసిన వ్యక్తితో బ్యాంకుకు వెళ్లింది. అంతే అదే ఆమె ఆఖరి రోజుగా మారిపోయింది. నమ్మి బైకెక్కిన వ్యక్తి చేతిలో ఆమె అత్యాచారానికి.. ఆపై హత్యకు గురై వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మునిపల్లి అటవీ ప్రాంతంలో సదరు మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్‌కొత్తూరుకు చెందిన గుండ రజిత (33)గా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. కోజన్‌ కొత్తూరుకు చెందిన గుండ రజిత (33) వివాహం కాగా.. భర్తతో విడాకులు తీసుకొని ప్రస్తుతం పుట్టింటి వద్దనే ఉంటోంది. సెప్టెంబర్‌ 28న ఇంటి నుంచి వెళ్లిన మళ్లీ ఆమె ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో అదే నెల 30న ఇబ్రహీంపట్నం పోలీసులకు తండ్రి గంగాధర్‌ ఫిర్యాదు చేశాడు.
 
28న ఇంటి నుంచి వెళ్లిన ఆమె అదే రోజు మెట్‌పల్లిలోని గాయత్రి బ్యాంక్‌లో రూ.6వేలు విత్‌డ్రా చేసుకుంది. అనంతరం మల్లాపూర్‌ మండలం శాతారానికి చెందిన ఒడ్డె గంగాధర్‌ (33)తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. ఇద్దరికి ఫోన్‌లో పరిచయం ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. రజితను జక్రాన్‌పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి, ఒంటిపై మూడు తులాల బంగారం ఉండడంతో లాక్కునేందుకు యత్నించగా.. ఇవ్వకపోవడంతో హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
 
చనిపోయిన తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఉంటాడని చెప్పారు. సదరు వివాహితకు మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పారు. కాగా, గంగాధర్‌.. రజితను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన దృశ్యాలు మెట్‌పల్లి బ్యాంక్‌ వద్ద, ఆర్మూర్ ఎక్స్‌రోడ్‌ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం