Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఆ పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న భర్త..

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (10:45 IST)
కుమారుడికి అన్నం తినిపించి.. నిద్రపుచ్చి.. బలవన్మరణంతో శాశ్విత నిద్రలోకి జారుకున్నాడు ఆ తండ్రి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో కలత చెందిన అతను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన  హైదరాబాద్ విజయ్ నగర్ కాలనీలో జరిగింది. వివరాలు పరిశీలిస్తే పెద్దల్ని ఎదిరించి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు విజయబాబు,రాణి. భార్య కోసం విజయ బాబు తన పేరును ప్రభువుగా మార్చుకున్నాడు. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వినోష్ అనే కుమారుడు జన్మించాడు.
 
కొంతకాలం అన్యోన్యంగానే సాగిన కుటుంబంలో కలతలు రేగాయి. కుమారుడు వినోష్‌ను భర్త వద్దే వదిలిపెట్టి.. నాలుగు రోజుల క్రితం పుట్టింటికెళ్లింది రాణి. అప్పటి నుంచి ప్రభువు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నాలుగో తరగతి చదివే కుమారుడు వినోష్ ట్యూషన్‌కు వెళ్తానని చెప్పినా.. ప్రభువు వద్దని వారించాడు. కుమారుడికి చివరిసారిగా అన్నం ముద్దలు కలిపి పెట్టి తినిపించాడు. బాబు వినోష్‌ను నిద్రపుచ్చాడు. ఆ తర్వాత ఇంట్లో హాల్లోని ఇనుప కొక్కేనికి చీరతో మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు ప్రభువు. 
 
ఇరుగుపొరుగు గమనించి.. తలుపు బాది వినోష్‌ని నిద్రలేపారు. కుమారుడు వినోష్ కళ్లు తెరిచి చూసేసరికి షాక్.. తండ్రి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించేసరికి గుండెలవిసేలా రోదించాడు ఈ పసివాడు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారని.. భర్తని వదిలి ఆమె పుట్టింటికి వెళ్లిందని చెప్తున్నారు మృతుని బంధువులు. రెండ్రోజుల క్రితం నల్లకుంట పోలీసుస్టేషన్లో భర్త ప్రభువుపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందని.. దాంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని చెప్తున్నారు. 
 
రాణికి తన బావతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబీకులు. నాన్న ఉరేసుకుని చనిపోయాడంటూ ఎనిమిదేళ్ల బాబు వినోష్ బంధువులందరికీ ఫోన్లు చేయడంతో ఇంటి వద్ద తీవ్ర విషాదం అలుముకుంది. సూసైడ్ నోట్ కూడా లభించలేదని.. మృతికి కారణాలేంటనేది దర్యాప్తులో తేలుతుందని చెప్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments