Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త ఐదుగురితో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందంటే?

భర్త ఐదుగురితో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందంటే?
, సోమవారం, 31 డిశెంబరు 2018 (16:07 IST)
పెళ్ళి మంత్రాలన్నీ నిజాలే చెబుతాయి. నిజాయితీగా ఉండాలనే చెబుతాయి. పెళ్ళి వేడుకల్లో బట్టలు, భోజనాలతో సరిపెట్టే ఈ రోజుల్లో ప్రమాణాలు చేయించే మంత్రాలకు ఉన్న విలువ ఏంటో ఎవరూ చెప్పడం లేదు. అందరూ మమతో సరిపెట్టుకుంటున్నారు. అందుకే పెళ్ళిళ్ళు మమకారంలేని మమలుగా మిగిలిపోతున్నాయా. 
 
ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే పెళ్ళికి అంత విలువ ఉంది కాబట్టి. అయితే అక్రమ సంబంధాలతో కాపురాలను నిలువునా కూల్చేసుకుంటున్నారు. అలాంటి సంఘటనే ఇది. అది విశాఖపట్నంలోని మెట్రో నగరంలోని గాంధీనగర్. రాకేష్‌, లక్ష్మి భార్యాభర్తలు. వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన కార్యాలయంలో ఎప్పుడూ యువతులే పనిచేస్తుంటారు. ముగ్గురు మహిళా సిబ్బంది ఎప్పుడూ కార్యాలయంలోనే ఉంటారు. 
 
పెళ్ళయిన కొత్తల్లో భర్తపైన భార్యకు ఎలాంటి అనుమానం లేదు. కానీ సరిగ్గా 10 సంవత్సరాల నుంచి భర్తలో మార్పు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు 8 నెలలు, సంవత్సరం వ్యవధిలో మానేస్తున్నారు. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. భర్త చాలాసార్లు మరుసటి రోజు ఉదయం వస్తుండేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఆలస్యమైందని భావించి సైలెంట్‌గా ఉండేది భార్య. కానీ భర్త మాత్రం తన కార్యాలయంలో పనిచేసే యువతులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుమందితో సహజీవనం చేశాడు కొన్నినెలల పాటు. 
 
యజమానితో బోర్ కొట్టిన ఆ యువతులు వేరే కంపెనీకి వెళ్ళిపోయేవారు. పిల్లలు పెద్దవుతున్నారు. మొదటి కొడుకు వయస్సు 12 యేళ్ళు, కూతురు వయస్సు 10 యేళ్ళు. ఇప్పుడు భార్యలో అనుమానం ప్రారంభమైంది. భర్త కార్యాలయంలో పనిచేసే ఒక మహిళ ద్వారా అసలు విషయం తెలుసుకుంది. భర్తలో మార్పు తీసుకురావాలని భావించింది. కౌన్సిలింగ్ సెంటర్‌కు తీసుకెళ్ళింది. తన ఆవేదన మొత్తాన్ని కౌన్సిలింగ్ సెంటర్లో చెప్పింది.
 
ఎదుగుతున్న కుమారుడు, కుమార్తె గురించి కౌన్సిలింగ్ సెంటర్లో రాకేష్‌‌కు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అతనిలో ప్రస్తుతానికి మార్పు కలిగింది. తన భర్తను మార్చుకున్నానన్న నమ్మకం ఆమెలో ఏర్పడింది. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా ఆ వివాహిత అందరికీ తెలియజేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇవాల్టితో ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... మీ ఫోను కూడా ఉందా?