Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు.. ఇంకా 2 రోజులు..?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (18:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఇంకా రెండు రోజుల పాటు అతి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది. 
 
వీటి ప్రభావంతో సోమవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. 
 
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం గాంగెటిక్‌ పశ్చిమ బెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో ఉండి, సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం రాత్రి, మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments