జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లా శివ్‌గఢ్‌లో మంగళవారం ఉదయం ఓ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలింది. వాతావరణం అనుకూలించపోవడంతో ఈ హెలికాఫ్టర్ నియంత్రణ కోల్పోయింది. దీంతో కుప్పకూలిపోవడంతో తునాతునకలైపోయింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ... తీవ్రంగా గాయపడ్డారు. పొగ మంచు కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు.
కాగా, హెలికాఫ్టర్ కూలిపోయిన విషయాన్ని స్థానికులు పోలీసులు, ఆర్మీ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో వెంటనే రెస్క్యూ టీమ్‌తో పోలీసులు ఆ స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు ఆర్మీ జవాన్లకు గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించామని ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌధరీ తెలిపారు. పొగ మంచు కారణంగా హెలికాప్టర్ కూలినట్లు ఆయన అన్నారు. అయితే హెలికాప్టర్ కూలిపోయిందా? లేక క్రాష్ ల్యాండింగ్ జరిగిందా? అన్నది తెలియాల్సి ఉందని అన్నారు.