తాలిబన్లు కాశ్మీర్‌పై స్పందించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే కాశ్మీర్‌పై ప్రశ్నిస్తామని, అది తమ హక్కు అంటూ తాలిబన్లు తెలిపారు. కాశ్మీర్‌తో పాటు ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని ప్రకటించారు. ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలు చేపట్టే విధానం తమకు లేదని చెప్తున్నారు.
అఫ్గానిస్తాన్ తిరిగి తాలిబన్ పాలనలోకి పోగా ఉగ్రముప్పు ఉందని భారత్‌లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన తాలిబన్-భారత్ భేటీలో కాశ్మీర్ భారత అంతర్గత విషయమని, జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్ల ప్రకటనతో తాజా ప్రకటన విభేదిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు భావిస్తున్నారు.