Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు : వివాదం - ఉద్రిక్తత

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (17:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం తలెత్తింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల ప్రజలను నియంత్రించారు. 
 
బోధన్‌లో శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికిరాత్రి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న మైనార్టీ నాయకులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన మైనార్టీ నేతలు బైఠాయించి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. 
 
అయితే, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఇరు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పోలీసులు తొలుత టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆ తర్వాత నిజామాబాద్ పోలీసు కమిషనర్ తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు బలగాలను కూడా మొహరించారు. ప్రస్తుతం బోధన్‌లో 144 సెక్షన్‌ను అమలు చేసి, ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments