Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బండి సంజయ్ అయిపోంది.. ఇపుడు అర్వింద్ అరెస్టుకు రంగం సిద్ధం

బండి సంజయ్ అయిపోంది.. ఇపుడు అర్వింద్ అరెస్టుకు రంగం సిద్ధం
, బుధవారం, 5 జనవరి 2022 (18:48 IST)
కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే, ఆయనకు బుధవారం రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రానికి మరో కీలక నేత, నిజామాబాద్ లోక్‌‍సభ బీజేపీ సభ్యుడు ధర్మపురి అర్వింద్ అరెస్టుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేశారు. పోలీస్ అధికారులతో మాట్లాడే సమయంలో అనుచిత పదజాలాన్ని ఉపయోగించారన్న ఆరోపణలపై ఆయనపై ఐపీసీ 294, 504 (1) సెక్షన్ల కింద బంజారా హిల్స్ పోలీసులు కొత్తగా కేసులు నమోదు చేశారు. 
 
ఈ నెల 2వ తేదీన ఈయనపై ఐపీసీ 504, 505 (2), 153 (ఏ) సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 67 కింద కేసులు నమోదు చేశారు. దీంతో అర్వింద్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో కలకలం చెలరేగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏం చేసినా ఈ ఏడాదే... టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కంగారు!