Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (11:23 IST)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఓకే చెప్పింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్‌ను కొట్టివేసింది.
 
గతంలో ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ  ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. 
 
ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిట్ విచారిస్తుంది. అయితే, సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతుందని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణ పారదర్శకంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు కోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. సీబీఐ విచారణకు ఆదేశించవద్దంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments