Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భర్త.. కాదు పొమ్మన్న ప్రియుడు

పెళ్లికి ముందు ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులు బలవంతంగా వేరొక వ్యక్తితో వివాహం జరిపించారు. కానీ ప్రేమించిన వ్యక్తిని ఆ యువతి వివాహమైనా మరిచిపోలేకపోయింది. కట్టుకున్న భర్తతో నిజం చెప్పింది. భర్త

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (13:54 IST)
పెళ్లికి ముందు ఓ యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులు బలవంతంగా వేరొక వ్యక్తితో వివాహం జరిపించారు. కానీ ప్రేమించిన వ్యక్తిని ఆ యువతి వివాహమైనా మరిచిపోలేకపోయింది. కట్టుకున్న భర్తతో నిజం చెప్పింది. భర్త కూడా భార్య చెప్పిన మాటకు విలువనిచ్చి.. ప్రియుడితో కలిసి సంతోషంగా వుండాలని ఇంటి నుంచి వెళ్లిపొమన్నాడు. కానీ సీన్ రివర్సైంది. 
 
ప్రేమికుడు ఆమెను ఛీ పొమ్మన్నాడు. పెళ్లి జరిగాక ప్రేయసిని చేరదీసేది లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో కట్టుకున్న భర్త వద్దకూ వెళ్లలేక, ప్రియుడితో కలిసి వుండలేక ఆ యువతి రోడ్డున పడింది. చివరికి ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. ఈ ఘటన తెలంగాణ పరిధిలోని ఆలేరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాఘవాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ, అరుణల కుమార్తె రేఖ, అదే గ్రామానికి చెందిన శివరామ్‌తో ప్రేమలో ఉంది. వారి ప్రేమను ఇష్టపడని తల్లిదండ్రులు సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపించారు. తాను ఇంతకుముందే ఓ యువకుడిని ప్రేమించానని.. అతనితోనే కలిసుండాలని కోరుకుంటున్నానని ఆమె తన భర్తకు చెప్పింది. 
 
భర్త కూడా ఆమె ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత పుట్టింటికి వెళ్లిపోయిన రేఖ.. తనను వివాహం చేసుకోవాలని శివారామ్‌ను కోరింది. కానీ ఒకసారి పెళ్లయిన రేఖను మళ్లీ పెళ్లి చేసుకోనని శివరామ్ తేల్చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుబోని రేఖ, తనకు న్యాయం చేయాలని కోరుతూ శివరామ్ ఇంటి ముందు దీక్షకు కూర్చుంది.

ఆపై శివరామ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రేఖకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తిరిగి భర్తతోనే రేఖ కలిసివుండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments