Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శైలజకు శాడిస్ట్ భర్తతో శోభనం ఎందుకు రివర్సయ్యిందో తెలిస్తే షాక్...?

రెండు తెలుగు రాష్ట్రాల్లోను సంచలనం కలిగించిన రాజేష్, శైలజ పెళ్ళి వ్యవహారంలో రోజుకొక ట్విస్టు బయటకు వస్తుంది. మొదట భార్యను వేధించాడని అందరూ అనుకున్నారు. ఆ తరువాత రాజేష్‌ మగవాడు కాదంటూ శైలజ తల్లిదండ్రులు ఆరోపించడంతో ఆ కోణంలో కూడా విచారణ జరిగింది. చివరక

శైలజకు శాడిస్ట్ భర్తతో శోభనం ఎందుకు రివర్సయ్యిందో తెలిస్తే షాక్...?
, బుధవారం, 13 డిశెంబరు 2017 (19:32 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లోను సంచలనం కలిగించిన రాజేష్, శైలజ పెళ్ళి వ్యవహారంలో రోజుకొక ట్విస్టు బయటకు వస్తుంది. మొదట భార్యను వేధించాడని అందరూ అనుకున్నారు. ఆ తరువాత రాజేష్‌ మగవాడు కాదంటూ శైలజ తల్లిదండ్రులు ఆరోపించడంతో ఆ కోణంలో కూడా విచారణ జరిగింది. చివరకు తన మగతనాన్ని నిరూపించుకోవడానికి రాజేష్‌ సిద్థమయ్యాడు. 
 
ఇంతకీ అతనంత ధీమాగా ఉండటానికి కారణాలేంటి. నిజంగానే రాజేష్‌‌లో అసలు అంత విషయముందా. ఉంటే మొదటి రాత్రే తన భార్యను అలా ఎందుకు వేధించాడు. శైలజ చేసిన ఆరోపణల్లో వాస్తవమెంత. రాజేష్‌ తన అత్యంత సన్నిహితుల మధ్య ఆరోజు సంఘటనను పంచుకున్నాడు. రాజేష్‌ ఒకానొక మిత్రుడు చెప్పిన వివరాల ప్రకారం తను అంగవైకల్యం కలిగిన వాడని తెలుస్తోంది. 
 
ఉద్యోగం కూడా ఫిజికల్ హ్యాండీకాప్డ్ కోటాలో సంపాదించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పెళ్ళికి ముందే అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ వారు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో ఈ సంఘటన జరిగిందని రాజేష్‌ వాపోయినట్లు సమాచారం. మొదటి రాత్రి రాజేష్‌‌కు ఒక బటెక్స్ లేకపోవడానికి శైలజ గుర్తించింది. తన వద్ద ఇంతటి లోపాన్ని పెట్టుకుని కూడా తనతో చెప్పలేదంటూ ఆ అమ్మాయి ప్రతిఘటించినట్లు సమాచారం. 
 
రాజేష్‌ ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా శైలజ ఒప్పుకోలేదట. అంతేకాదు తన అంగవైకల్యాన్ని పదేపదే శైలజ ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు రాజేష్‌. విచక్షణా రహితంగా శైలజను కొట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్తూరు కోర్టు రాజేష్‌ను పరీక్షలకు ల్యాబ్‌కు పంపిస్తుండటంతో ఆయన మగాడేనని తేలిపోతుందని అంటున్నారు. అయితే దీనిపైన కోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది? చివరకు ఏమని తీర్పు వస్తుందన్నది చాలా ఆసక్తికరంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ ఓ గజినీ... బతికి వుండగానే చంద్రబాబు పథకాలా? రోజా తీవ్ర విమర్శ