పాము కరిస్తే.. నాటు వైద్యం చేశారు.. కడుపు నొప్పి అని నిర్లక్ష్యం చివరికి?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (21:46 IST)
ఓ పాము అన్నదమ్ములను కాటేసింది. ఈ ఘటనలో అన్న మృతిచెందగా తమ్ముడి పరిస్థితి విషమంగా వుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని దౌలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతుడు రాంచరణ్‌(10) స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. రాంచరణ్ తన తమ్ముడు నరసింహులు(7), సోదరి శృతి, తండ్రి నారాయణ, తల్లి కేశమ్మతో కలిసి ఇంట్లో నేలపై పడుకున్నాడు. నిద్ర నుంచి లేవడంతోనే రాంచరణ్ కడుపునొప్పిగా ఉందని పేర్కొన్నాడు.
 
దుప్పటిని దులిపి చూడగా అందులో విషపూరిత పాము కనిపించింది. నర్సింహులు సైతం నొప్పిగా ఉందని తెలిపాడు. సమస్య తీవ్రత తెలియని తల్లిదండ్రులు ఇద్దరిని సమీప గ్రామం రామతీర్థంలోని నాటు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు.
 
పరిస్థితి విషమించడంతో చిన్నారులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు అన్నదమ్ములను ఇద్దరినీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమాద్యలోనే రాంచరణ్ చనిపోయాడు. నరసింహులు ప్రాణాలతో పోరాడుతున్నాడు. జరిగిన ఘటనపై పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments