Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంగిస.. పాము రోడ్డుపై ఎదురుపడితే.. వీడియో చూడండి..

ముంగిస.. పాము రోడ్డుపై ఎదురుపడితే.. వీడియో చూడండి..
, గురువారం, 20 ఆగస్టు 2020 (10:52 IST)
snake, mongoose
ముంగిస.. పాము ఎదురుపడితే ఆ పోరు భయంకరంగా వుంటుంది. నువ్వా నేనా అంటూ పాము, ముంగిస పోటీ పడతాయి. అలాంటి ఆ రెండు రోడ్డుపై ఎదురుపడ్డాయి. ఇంకా వాటి మధ్య భీకర పోరు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి డాక్టర్ అబ్దుల్ ఖయూమ్ షేర్ చేశారు. 
 
ప్రజలు రోడ్డు పక్కన నిలబడి మొత్తం సంఘటనను చూసేటప్పుడు ముంగిస, పాము.. రోడ్డు మధ్యలో ఒకదానితో ఒకటి పోరాడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ పోరాటం ప్రకృతిలో సహజం.. ఈ రెండు జాతులను కాపాడేందుకు ఏ వ్యక్తి ప్రయత్నించకపోవడం మంచిదే. వాటి పోరులో  జోక్యం చేసుకోనందుకు పరిసరాల్లోని ప్రజలను మెచ్చుకున్నారు.
 
ప్రకృతి మార్గానికి అంతరాయం కలిగించకుండా ఉండటానికి ప్రజలు తమ వాహనాలతో రోడ్డు పక్కన నిలబడి ఈ వీడియోలో కనిపించింది.  ఈ పోరాటంలో పాము కాలువ లోపల దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ముంగిస దానిని చంపి నోటిలో పట్టుకొని పారిపోతుంది. ఈ వీడియోను 6.4కే నెటిజన్లు వీక్షించారు. ఇంకా ఈ వీడియోపై విభిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్న నెటిజన్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమర్జెన్సీ ఆథరైజేషన్‌ కింద ముందుగానే కరోనా వ్యాక్సిన్...