Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొండ చిలువను వాషింగ్‌ మెషీన్‌లో వేసి ఉతికి ఆరేసిన మహిళ... ఎక్కడ? (video)

Advertiesment
కొండ చిలువను వాషింగ్‌ మెషీన్‌లో వేసి ఉతికి ఆరేసిన మహిళ... ఎక్కడ? (video)
, సోమవారం, 10 ఆగస్టు 2020 (17:45 IST)
ప్రపంచంలో అపుడపుడూ జరిగే కొన్ని సంఘటనలు వింటుంటే కాస్తంత విడ్డూరంగా ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యానికి లోను చేస్తుంటాయి. తాజాగా ఓ మహిళ కొండ చిలువను వాషింగ్ మెషీన్‌లో వేసి ఉతికింది. ఆ తర్వాత ఆరేసేందుకు తీసేందుకు ప్రయత్నించగా అసలు విషయం తెలుసుకుని గుండె ఆగినంత పనైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫ్లొరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌కు చెందిన ఎమిలీ అనే ఓ మహిళ... విప్పేసిన బట్టలను ఉతికేందుకు బట్టలను వాషింగ్ మెషీన్‌లో వేసింది. వీటిలో బెడ్‌షీట్లు, ఇతర బ‌ట్ట‌ల‌ు ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత వాషింగ్ మెషీన్ ఆన్‌చేసి పెట్టేసింది. 
 
ఈ బట్టలన్నీ ఉతికిన తర్వాత బెడ్‌షీట్ల‌ను ఆరేయ‌డానికి డోర్ ఓపెన్ చేసి రంగురంగులుగా క‌నిపిస్తున్న షీట్ మెషీన్ నుంచి బ‌య‌ట‌కు లాగింది. అది కాస్త వెచ్చ‌గా, మందంగా, బ‌రువుగా ఉండ‌టంతో గుండె ల‌బోదిబో కొట్టుకోవ‌డం ప్రారంభ‌మైంది. 
 
తీరా ఏంట‌ని చూసేస‌రికి కొండ‌చిలువ‌. ఇంకేముంది కెవ్వు.... మ‌ని అరిచి దాన్ని వాషింగ్ మెషీన్‌లోనే వేసి అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు కాల్ చేసింది. వెంట‌నే వారు వ‌చ్చి కొండ‌చిలువ‌ను బంధించారు. మెషీన్‌లో అన్ని తిప్పులు తిరిగినా కొండ‌చిలువ సేఫ్‌గానే ఉండ‌టంతో వారు దానిని అట‌వీ ప్రాంతంలో విడిచిపెట్టారు. 
 
కొండ‌చిలువ వాషింగ్ మెషీన్‌లోకి ఎలా దూరిందో ఇప్ప‌టికీ అంతుచిక్క‌డం లేదు. డోర్ల‌న్నీ మూసేసున్నాయి. ఇంత‌పెద్ద‌ది ఎవ‌రికీ క‌నిపించ‌కుండా లోప‌లికి రావ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు. ఇది జ‌రిగి చాలాసేపు అయినా మ‌హిళ కాళ్లు, చేతులు వ‌ణుకుతున్నాయి. ఈ ఘటన ఫ్లొరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో చోటుచేసుకుంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాస్ గుప్తా సంథింగ్ స్పెషల్.. భార్య లేదని ఆమె మైనపు బొమ్మతో గృహప్రవేశం (video)