Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లవ్ ప్రపోజల్ కోసం ఇంటినే తగులబెట్టిన ప్రియుడు!!

లవ్ ప్రపోజల్ కోసం ఇంటినే తగులబెట్టిన ప్రియుడు!!
, సోమవారం, 10 ఆగస్టు 2020 (09:24 IST)
సాధారణంగా కొందరు యువకులు తమకు నచ్చిన అమ్మాయిలకు తమకు తోచిన విధంగా లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. కానీ, ఈ యువకుడు చేసిన పని భిన్నంగా ఉంది. తనలోని ప్రేమను వ్యక్తం చేయడానికి ఏకంగా ఓ ఇంటినే తగులబెట్టాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇంగ్లాండ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌కు చెందిన ఒక అబ్బాయి త‌ను ప్రేమించిన అమ్మాయికి ల‌వ్ ప్ర‌పోజ్ చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న విధంగానే ప్లాన్ చేసుకొని గ‌దికి తాళం వేసి అమ్మాయిని తీసుకురావ‌డానికి వెళ్లాడు. అమ్మాయికి ఆ మాటా ఈ మాటా చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. త‌లుపు తెరిచి చూసే స‌రికి అంతా నాశ‌నం.
 
పెద్ద పెద్ద మంట‌లు చెల‌రేగుతున్నాయి. దీంతో వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి ఫోన్ చేశాడు. వ‌చ్చి ఆ మంట‌లు ఆర్పేస‌రికి అక్క‌డంతా బూడిద అయిపోయింది. షార్ట్‌స‌ర్క్యూట్ జ‌రిగిందేమో అనుకున్నారు. అప్పుడే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. 'ప్రియురాలిని స‌ర్‌ఫ్రైజ్ చేద్దామ‌ని గ‌దిలో 100 కొవ్వొత్తులు వెలిగించి ఆ త‌ర్వాత త‌లుపులు వేసి ఆమెకు తీసుకురావ‌డానికి వెళ్లాను. ఈలోపు ఇలా జ‌రిగింద‌ని' కూల్‌గా బదులిచ్చాడు. ఇది విని వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ త‌ర్వాత ఈ సంఘ‌ట‌న‌ను సౌత్ యార్క్‌షైర్ ఫైర్ డిపార్టుమెంట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వర్ణ ప్యాలెస్ హోటల్ ప్రమాదానికి కారణం శానిటైజర్లే కారణమా?