Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 27 March 2025
webdunia

భారత్ - బంగ్లాదేశ్ బంధం రక్త సంబంధం : బంగ్లాదేశ్

Advertiesment
భారత్ - బంగ్లాదేశ్ బంధం రక్త సంబంధం : బంగ్లాదేశ్
, సోమవారం, 10 ఆగస్టు 2020 (17:05 IST)
ఇటీవలి కాలంలో భారత్‌కు మిత్రదేశాలుగా ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు కాస్త కాలర్ ఎగరేస్తున్నాయి. ముఖ్యంగా, కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణమాలు చూస్తే పలు దేశాలు దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. 
 
ఎప్పటినుంచో చైనా, పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కుతుండగా... ఈ మధ్య చైనా అండ చూసుకుని నేపాల్ కూడా రెచ్చిపోతోంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం అన్నివేళలా భారక్‌కు నమ్మదగిన మిత్రదేశంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ మాటే చెబుతోంది.
 
ఇదే అంశంపై ఆ దేశ విదేశాంగమంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ స్పందిస్తూ, "భారత్‌తో మా సంబంధాలు చారిత్రాత్మకమైనవి... రాక్ సాలిడ్!" అని స్పష్టం చేశారు. "అనేక వాణిజ్యపరమైన అంశాలు చైనాతో ముడిపడి ఉన్నా, మనది రక్త సంబంధం" అని వ్యాఖ్యానించారు.
 
"మేం విజయం సాధిస్తే భారత్ విజయం సాధించినట్టే. మా అభివృద్దే భారత్ అభివృద్ధి. మా సంబంధాలను మరేదీ ఆటంకపర్చలేదు" అని అన్నారు. కేరళలో జరిగిన విమానప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసేందుకు అబ్దుల్ మోమెన్ భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌తో తమ అనుబంధంపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్ : రమేష్ ఆస్పత్రి