Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మానవత్వాన్ని మరోసారి చాటుకున్న సినీనటుడు కమల్ హాసన్..!

Advertiesment
మానవత్వాన్ని మరోసారి చాటుకున్న సినీనటుడు కమల్ హాసన్..!
, శుక్రవారం, 7 ఆగస్టు 2020 (23:15 IST)
ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఎవరైనా ఇబ్బందులు పడుతూ తన దృష్టికి వస్తే వెంటనే స్పందించి తనవంతు ఆర్థిక సహాయం చేస్తుంటాడు కమల్ హాసన్. గతంలో తన అభిమానులు అనారోగ్యంతో ఉన్నా.. సినిమా చూసేందుకు వచ్చి మృత్యువాత పడినా వెంటనే వారి కుటుంబాలను ఆదుకునేవాడు.
 
భారీగా వారికి డబ్బులు కూడా వచ్చేవారు కమల్ హాసన్. దక్షిణాదిలోను ఏ హీరో ఈవిధంగా సహాయం చేసి ఉండరని కూడా కమల్ హాసన్ గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. అలాంటి కమల్ హాసన్ తన సినిమా చిత్రీకరణలో ప్రమాదం జరిగి ముగ్గురు మరణిస్తే చలించిపోయాడు. వారిని ఎలాగైనా ఆదుకోవాలనుకున్నాడు. 
 
అయితే కరోనా విజృంభిస్తుండడంతో కమల్ హాసన్ వెనక్కి తగ్గారు. కానీ ఆ కుటుంబాలను ఎలాగైనా ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈరోజు స్వయంగా బాధితులను పిలిపించి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చాడు. అలా మూడు కుటుంబాలకు అందజేశాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి కుటుంబానికి 90 లక్షల రూపాయలను ఇచ్చారు కమల్ హాసన్. 
 
ఇండియన్-2 సినిమా చిత్రీకరణలో ఫిబ్రవరి 19వ తేదీన అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్‌లో పనిచేస్తున్న ముగ్గురు ప్రమాదవశాత్తు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి కుటుంబాలను కమల్ హాసన్ ఆదుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లాస్మా దానం చేస్తే ప్రాణానికి హానికరమా? చిరంజీవి ఏమన్నారు?