Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, బ్యాంకు ఉద్యోగి మృతి

Advertiesment
SBI employeed died in Kurnool Road accident
, బుధవారం, 29 జులై 2020 (14:03 IST)
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంకు ఉద్యోగి మృతి చెందారు. ఒకరు సజీవ దహనం అయ్యారు. నంద్యాల సమీపంలో శాంతిరాం ఆస్పత్రి సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు బయటకు రావడానికి ప్రయత్నించగా ఒకరు తప్పించుకోలేక కారులోనే సజీవ దహనం అయ్యారు.
 
మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో సజీవ దహనమైన వ్యక్తి నంద్యాల పట్టణంలో ఎస్బీఐ ఉద్యోగి శివకుమార్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
మృతుడు శివకుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతు నగరం కాగా నంద్యాల ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై మురికివాడల్లో 57 శాతం మందికి కరోనా : తెలంగాణాలో కొత్త కేసులెన్ని?