Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదో మగాడి కోసం వెంపర్లాడిన మహిళ హత్య

Advertiesment
పదో మగాడి కోసం వెంపర్లాడిన మహిళ హత్య
, బుధవారం, 29 జులై 2020 (09:56 IST)
తొమ్మిది మందిని చేసుకున్నా ఆమె కామదాహం తీరలేదు. ఇంకేదో పొందడం కోసం పదో వ్యక్తి తో తిరగడం మొదలుపెట్టింది. అది భరించలేని తొమ్మిదో భర్త ఆమెను వారించేందుకు ప్రయత్నించాడు. అయినా ఆమె విశృంఖలంగా తిరుగుతూనే వుండడంతో భరించలేక కిరాతకంగా హత్య చేశాడు.

పోలీసులు తెలిపిన కథనం మేరకు...ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన క్యాబ్‌డ్రైవర్‌ నాగరాజు మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపల్‌ పరిధి శ్రీరామకాలనీలో ఉంటున్నాడు. నాగరాజుకు స్థానికంగా ఉండే వరలక్ష్మి(30)తో పరిచయమైంది. వరలక్ష్మి కాటేదాన్‌ పారిశ్రామికవాడలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తోంది.

అప్పటికే ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. నాగరాజు, వరలక్ష్మి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో వరలక్ష్మి రెండేళ్ల క్రితం తన భర్తను వదిలేసి నాగరాజును పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత వరలక్ష్మి కొత్త వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం నాగరాజు గమనించాడు. వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. మూడు రోజుల క్రితం మళ్లీ గొడవ జరిగింది.

మంగళవారం కూడా గొడవ జరిగి పెద్దది కావడంతో నాగరాజు ఆగ్రహంతో కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. నేరుగా పహాడీషరీఫ్‌ ఠాణాకు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయాడు. అయితే వరలక్ష్మికి నాగరాజు తొమ్మిదో భర్త అని దర్యాప్తులో తేలింది. ఇలా ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం, గొడవలు జరిగి భర్తలతో విడిపోయి మరో పెళ్లి చేసుకునేదని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడో నిజాం కుమార్తె మృతి