Publish Date: Thu, 28 May 2020 (08:42 IST)
Updated Date: Thu, 28 May 2020 (08:48 IST)
సాధారణ పరీక్షల కోసం ఆర్టీసీ బస్సులో టౌనుకు బయలుదేరిన మహిళ మార్గమధ్యలో నే ప్రసవించింది. మహిళ ఆర్‌టిసి బస్సులోనే ప్రసవించిన ఘటన తెలంగాణలో జరిగింది.
గద్వాల జిల్లాలోని గట్టు మండలానికి చెందిన మహిళ చికిత్స కోసం ఆర్‌టిసి బస్సులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలు దేరింది.
అయితే మార్గమధ్యంలో ఆమెకు నొప్పులు తీవ్రం కావడంతో తోటి మహిళలు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం అదే బస్సులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ మహిళ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.