Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసులు పునరుద్ధర‌ణ‌.. జర్నలిస్టుల‌ రాయితీలు నిలిపివేత‌

ఏపీలో ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసులు పునరుద్ధర‌ణ‌.. జర్నలిస్టుల‌ రాయితీలు నిలిపివేత‌
, గురువారం, 21 మే 2020 (06:46 IST)
ఏపీలో గురువారం ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసులను పునరుద్ధరించారు. ఈ వివరాలను ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. విశాఖ‌, విజ‌య‌వాడ న‌గ‌రాల్లో సిటీ స‌ర్వీసులు మిన‌హా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉదయం నుంచి పునరుద్ధరించినట్లు తెలిపారు.

ఆర్టీసీ బస్సుల్లో సీట్లు తగ్గినా ఫర్వాలేదు ప్రయాణికుల క్షేమమే త‌మ‌కు ముఖ్యమని స్పష్టం చేశారు. బస్సుల్లో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలు కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

"ముఖ్యంగా ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, బస్టాండ్లలోని అన్ని స్టాళ్లలో మాస్కులు అందుబాటులో ఉంచినట్లు కండక్టర్‌ను బస్సులో ఉంచితే ఏ ప్రయాణికుడికి వైరస్ ఉన్నా ఇబ్బందే, కండక్టర్. ప్రయాణికులకు కరోనా సోకే ప్రమాదం ఉంది. ఈ స‌మ‌యంలో బోర్డ్ కండక్టర్ లేకుండా బస్సులు నడపడం ఎలా అన్న దానిపై ఆలోచనలు చేస్తున్నాం.

కండక్టర్‌ను పూర్తిగా తీసేయట్లేదు. బస్సులో కండక్టర్ లేకుండా చర్యలు మాత్రమే తీసుకుంటున్నాం. ప‌దేళ్లలోపు పిల్లలు. 65ఏళ్లు పైబ‌డిన వృదులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దు. యంత్రాన్ని ముట్టుకోకుండానే ప్రయాణికుల శానిటైజేషన్‌తో శుభ్రం చేసుకునేలా  చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది సహా ప్రయాణికుల భద్రత దృష్ట్యా నగదు రహిత విధానం అమలు చేయబోతున్నాం.

రిజర్వేషన్ ద్వారా నగదు రహిత విధానంలో టిక్కెట్లు జారీ. అన్ని బస్సులో టిక్కెట్లకు ఆన్‌లైన్ విధానం అమలు చేస్తాం. అన్ని వ్యాలెట్లు, కార్డులు సహా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా టిక్కెట్లు జుర్ చేసుకోవాల్సి ఉంటుంది. 90 శాతం నగదు రహితంగా టిక్కెట్లు జారీ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాం" అని చెప్పారు.
 
జర్నలిస్టుల‌ రాయితీలును నిలిపివేత‌... 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పాత్రికేయుల‌కు ఇచ్చే రాయితీల‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘కరోనా’ కారణంగా దాదాపు రెండు నెలల‌ తరువాత గురువారం ఉద‌యం నుంచి ప్రభుత్వం మళ్లీ సర్వీసుల‌ను నడుపుతోంది. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల‌కు ఇస్తోన్న రాయితీల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తోన్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది.

వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయుల‌తో సహా వివిధ వర్గాల‌కు అందిస్తోన్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంస్థ అధికారులు ప్రకటించారు. ‘కరోనా’ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో బస్సుల్లో సీట్లను తగ్గించి వేసింది.

దీంతో బస్సుకు 20మంది కంటే ఎక్కువ మందిని ఎక్కించుకునే పరిస్థితి లేకపోవడంతోనే రాయితీల‌ను నిలిపివేశారని సమాచారం. సీట్లు తగ్గించడంతో రాబడి తగ్గుతుందని, అదే సమయంలో రాయితీ ప్రయాణీకుల‌ను అనుమతిస్తే..మరింత నష్టాలు వచ్చే పరిస్థితి ఉందని అందుకే రాయితీల‌న్నీ నిలిపివేసిట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. క‌రోనా వ్యాప్తి త‌గ్గిన త‌రువాత య‌ధావిధిగా రాయితీల‌ను ఇస్తామ‌ని వారు చెబుతున్నారు.
 
ఏపీఎస్ ‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్ ప్రారంభం....
ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్లను ప్రారంభించింది. రిజర్వేషన్‌ చేసుకున్నవారినే బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఆర్టీసీ స్పష్టం చేసింది.

ఈ మేరకు పలు ప్రాంతాలకు నడిచే బస్సుల వివరాలను ఏపీఎస్‌ఆర్టీసీ తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ప్రయాణికులు apsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చని సూచించింది. అయితే నిర్ణీత ప్రాంతాల మధ్య కొన్ని సర్వీసులను మాత్రమే నడపనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.

విజయవాడ-విశాఖ మధ్య రేపు 1 ఏసీ, 6 సూపర్‌ లగ్జరీ బస్సులను నడపనున్నట్లు తెలిపింది. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కేవలం 18 సీట్లకే రిజర్వేషన్‌ చేసుకునేందుకు అనుమతించినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఇండ్ల స్థలాల దరఖాస్తుకు మరో అవకాశం