Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయవాడలో వాట్సప్ నంబర్ ద్వారా రవాణాశాఖ సేవలు

Advertiesment
Transport Services
, బుధవారం, 20 మే 2020 (08:45 IST)
కరోన  వైరస్ వ్యాప్తి చెందుతున్న నైపద్యంలో  విజయవాడ రవాణాశాఖ కార్యాలయానికి  ఎక్కువ శాతం ప్రజలు రాకుండా ఉండేందుకు గాను వాట్సప్ నెంబర్ ద్వారా సేవలందించాలని నిర్ణయం తీసుకున్నామని, వాట్సప్ నెంబర్ కు మెస్సేజ్ రూపంలో గాని, ఫోన్ చేసి గాని రవాణాశాఖ సేవలను పొందవచ్చని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు.
 
కరోన వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి  చెందుతున్న కారణంగా ఒకేచోట ప్రజలు ఎక్కువశాతం ఉండకుండా ఉండేందుకు లాక్ డౌన్ ను అవలంబిస్తున్న నైపద్యలో రవాణాశాఖలో అవలంబిస్తున్న ఆన్ లైన్ విధానంలోని  సేవలను పూర్తి స్థాయిలో ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

విజయవాడ ఆర్టీఏ కార్యాలయంనకు ప్రజల రాక పోకలు తగ్గించాలని శాకఫరమైన ఏ సమాచారంనైన ఉదయం10.30 నుండి సాయంకాలం 5 గంటల లోపు వాట్సప్ నెంబర్ 9014356778కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని,  డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు మంగళవారంనాడు ఒక ప్రకటనలో తెలియజేశారు.

లాక్ డౌన్ కారణంగా లెర్నర్ లైసెన్స్ లు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ ల స్లాట్ బుకింగ్ లను తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కొరకు మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేయడం కోసం కార్యాలయంలో ఒక డాక్టర్ ఉండేవారని కానీ లాక్ డౌన్ కారణంగా కార్యాలయంలోని డాక్టర్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశామన్నారు.

సెకండ్ వెహికల్ వెరిఫికేషన్ కోసం, సీజ్ చేసిన వాహనాల విడుదల కోసం విజయవాడ డిటీసీ కార్యాలయంనకు రాకుండానే  వాట్సప్ నెంబరుకు తెలియజేస్తే  వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

స్మార్ట్ కార్డులు అందకపోయిన వాటి వివరాలను aprtacitizen.epragathi.org లో చేసుకోవచ్చునని లేదా
వాట్సప్ నంబరు కు తెలియజేసి ఫోన్ ద్వారా సమాచారంను తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. శాఖాపరంగా సంబందించిన ఏ విధమైన సమాచారంనైనా వాట్సప్ నెంబర్ కు తెలియజేస్తే, వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

ఇప్పటికే వాహన చోదకులు, యజమానుల చిరునామాలు సరిగ్గా లేని కారణంగా తపాలాశాఖ ద్వారా వెనక్కి తిరిగి వచ్చిన డ్రైవింగ్ లైసెన్సు ల స్మార్ట్ కార్డులను  ప్రతి గురువారంనాడు, అలాగే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ల స్మార్ట్ కార్డు లను ప్రతి శుక్రవారం కార్యాలయంలో అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

కార్యాలయాలకు వచ్చిన ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఫేస్ మాస్క్ లను ధరించి మాత్రమే రావాలన్నారు. ఆన్ లైన్ లో శాఖఫరంగా సేవలు పొందేటప్పుడు సరైన చిరునామాలు పొందుపర్చని కారణంగా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులకు సంబందించిన స్మార్ట్ కార్డులు తిరిగి కార్యాలయాలకు చేరుతున్నాయన్నారు.

సరైన చిరునామా లేక తిరిగి వచ్చే స్మార్ట్ కార్డులను ఇకపై రానున్న రోజుల్లో కార్యాలయాల్లో అందజేయ్యడం జరగదని మరల ఆన్ లైన్ లో సరైన చిరునామా మార్పు చేసుకుంటేనే పోస్టు ద్వారా ఆర్ సి కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు కార్డులను పంపించడం జరుగుతుందని డిటిసి తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్సులు వాహన రిజిస్ట్రేషన్ కు సంబందించిన పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు ప్రస్తుత చిరునామాను నమోదుచేసుకోవాలనే అవగాహనను కల్పించాలని వాహన డీలర్లను, ఆన్ లైన్ సెంటర్, సీఎస్ సి సెంటర్ నిర్వాహకులను, ఈ సేవ మీసేవ నిర్వాకులను డిటిసి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఆర్టీలకు సెలవుల్లోనూ వేతనాలు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి