దుబాయ్ కువైట్ వంటి దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా తీసుకువచ్చే భాగంలో నేడు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఏర్పాట్లపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు.
సుమారు 150 మంది వచ్చే అవకాశం ఉండటంతో వారికి పెయిడ్ క్వారెంటన్, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటన్ లకు తరలించడానికి కావల్సిన ఏర్పాట్లపై విమానాశ్రయ అధికారులు, పోలీస్ అధికారులతో మాట్లాడారు..
విమానాశ్రాయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన వీరందరికి ధర్మో స్క్రీనింగ్ పరిక్షలు జరిపి అనంతరం క్వారెంటన్ లకు తరలిస్తామని సీపీ ద్వారాకా తిరుమల రావు చెప్పారు.