Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్రమ సంబంధం... పుట్టింటికి వెళ్లమని చెప్పాడనీ భర్తను చంపేసిన భార్య!

Advertiesment
అక్రమ సంబంధం... పుట్టింటికి వెళ్లమని చెప్పాడనీ భర్తను చంపేసిన భార్య!
, ఆదివారం, 10 మే 2020 (12:52 IST)
పరాయి పురుషుడుతో తాను పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని కట్టుకున్న భర్త కళ్లారా చూసాడు. దీంతో భార్యను పుట్టింటికి వెళ్లిపొమ్మని భర్త ఒత్తిడి చేశాడు. పుట్టింటికి వెళ్లేందుకు నిరాకరించిన కసాయి భార్య... తన ప్రియుడుతో కలిసి భర్తను కడతేర్చింది. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన గురిపాటి నాగరాజు (30) అనే వ్యక్తికి భూలక్ష్మి (23) అనే యువతితో ఏడేళ్ళ క్రితం వివాహమైంది. వీరిద్దూ నాలుగేళ్ల క్రితం వీరిద్దరు ఏలూరుకు పొట్టచేతబట్టుకుని వచ్చారు. ఏలూరులోని వట్లూరు రాఘవ ఎస్టేట్‌ సీతా కాలనీలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవించసాగారు. 
 
ఈ క్రమంలో వట్లూరులోని ప్రగతి పౌల్ట్రీ కాంప్లెక్స్‌ ప్రాంతానికి చెందిన తోకల సురేశ్‌బాబు అలియాస్‌ సురేశ్‌ (40) కూడా తాపీ పనులకు వచ్చేవాడు. ఈయనకు భూలక్ష్మితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికిదారితీసింది. ఓ రోజున తన భార్యతో సురేశ్ ఏకాంతంగా ఉండటాన్ని నాగరాజు చూసి భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పైగా, పుట్టింటికి వెళ్లిపోవాలంటూ భార్యను ఒత్తిడిచేయసాగాడు. 
 
దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసిన భూలక్ష్మి.. తన ప్రియుడుతో కలిసి పథకం వేసింది. ఈనెల 6వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు నాగరాజు ఇంట్లోనే అతనితో కలసి సురేశ్‌ మద్యం తాగాడు. రాత్రి 8.30  గంటల సమయంలో భూలక్ష్మి, సురేశ్‌ కలిసి నాగరాజు మెడకు టవల్‌ చుట్టి హతమార్చారు. నాగరాజుపై కోపం తగ్గక భూలక్ష్మి ఇనుపరాడ్డుతో అతని తలను పగులగొట్టింది. 
 
7వ తేదీ ఉదయం ఇంటి వద్ద ఉన్న రక్తపు మరకలను తుడుస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డు కొత్తూరు వెంకరత్నం గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈలోపే తన భర్త ఉరేసుకుని మరణించాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. 
 
అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, భూలక్ష్మితో సురేశ్‌కు అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుసుకుని వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. దీంతో వారిద్దరీ అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నలుగురు భార్యలున్న 70 యేళ్ళ వృద్ధుడు యువతిపై అత్యాచారం!