Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాలి కలుషితం - కళ్లమంటలతో గ్రామస్థుల అవస్థలు.. ఎక్కడ?

గాలి కలుషితం - కళ్లమంటలతో గ్రామస్థుల అవస్థలు.. ఎక్కడ?
, శుక్రవారం, 8 మే 2020 (09:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం పచ్చని పంట పొలాలతో కనిపించే జిల్లాల్లో వెస్ట్ గోదావరి ఒకటి. అలాంటి ఈ జిల్లాలో పలు గ్రామాల్లో గాలి కలుషితమైపోతోంది. ఫలితంగా ఆ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు వివిధ రకలా వ్యాధులతో బాధపడుతున్నారు. 
 
తాజాగా ఈ జిల్లాలోని పలు గ్రామాల్లో గాలి కలుషితమైపోయింది. ముఖ్యంగా, ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారి సమీపంలో గాలి కలుషితం కావడంతో ప్రజలు కళ్లమంటలతో తల్లడిల్లిపోయారు. అలాగే, చర్మంపై దద్దుర్లు కూడా వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా, విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. 
 
గాలిలో కలుషితం వల్లే కళ్లు మండుతున్నట్టు గుర్తించారు. ఏలూరు సాగునీటి కాలువలోకి వదిలిన వ్యర్థాల వల్లే గాలి కలుషితం అయిందని స్థానికులు మండిపడుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 
ఎన్.ఎల్.సిలో పేలిన బాయిలర్ 
మరోవైపు, తమిళనాడు రాష్ట్రంలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఓ బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అధిక వేడిమి వెలువడడంతో ఒత్తిడికి గురై బాయిలర్ పేలినట్టుగా భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఎన్నెల్సీ ప్లాంట్ కు తరలివెళ్లారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం సమయంలో జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థరాత్రి మళ్లీ గ్యాస్ లీక్ ... ప్రాణభయంతో స్థానికులు పరుగు